Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో టెండర్లకు నోటిఫికేషన్.. బిడ్డింగ్‌కు చివరి తేదీ జులై 5
Airport Metro | ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. రేపట్నుంచి బిడ్డింగ్ పత్రాలను హెచ్‌ఏఎంఆర్‌ఎల్ జారీ చేయనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో బిడ్డింగ్‌కు చివరి తేదీ జులై 5.
Airport Metro | తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఎంతో దూరదృష్టితో నగర వాసులు మెట్రో రైలు ద్వారా విమానాశ్రయానికి అత్యంత వేగంగా చేరుకునేలా మొదటి దశ మెట్రోను అనుసంధానం చేస్తూ ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది. రేపట్నుంచి బిడ్డింగ్ పత్రాలను హెచ్‌ఏఎంఆర్‌ఎల్ జారీ చేయనుంది. ఎయిర్‌పోర్టు మెట్రో బిడ్డింగ్‌కు చివరి తేదీ జులై 5. మెట్రో కాంట్రాక్ట్ విలువ రూ. 5,688 కోట్లుగా నిర్ధారించింది.
మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ నిర్మించనున్నారు. ఈ ఎయిర్‌పోర్టు ఎక్స్‌ప్రెస్ మెట్రోకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం..
ఎయిర్ పోర్టు మెట్రో విశేషాలు..
-రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి 0.9కిలో మీటర్ల దూరంలో ఎయిర్‌పోర్టు టెర్మినల్ నిర్మాణం
-ఎయిర్‌పోర్టు మెట్రో స్టేషన్లుక్లోజ్డ్ సర్క్యూట్‌తో ఉంటాయి.
-శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కార్గో లైన్, ప్యాసింజర్ లైన్ వేర్వేరుగా రెండు స్టేషన్లు
-ఆరు బోగీలు నిలిపేలా మెట్రోస్టేషన్ నిర్మాణం, తొలి దశలో మూడు బోగీలు మాత్రమే
ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్ హైలెట్స్
-పొడవు:31 కిలోమీటర్లు (మొత్తం)
-ఎలివేటెడ్ వే: 27.5 కిలోమీటర్లు
-రోడ్ వే: 1 కిలోమీటర్
-అండర్ గ్రౌండ్ వే: 2.5 కిలోమీటర్లు
-వేగం: గరిష్ఠంగా 120 కిలోమీటర్లు
-ఫ్రీక్వెన్సీ: 2.5నిమిషాలు (పీక్ ఆవర్స్)
-సమయం:26 నిమిషాలు
-స్టేషన్లు: 8 లేదా 9 (ప్రతిపాదన ప్రకారం)
-ప్రారంభం: రాయదుర్గం టెర్మినల్ (నూతనంగా)
-నిర్మాణ సమయం: 36 నెలలు
-అంచనా వ్యయం: 6250 కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

