హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ ఉపఎన్నికలో గెలిచిన నోముల భగత్ గురువారం ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చాంబర్లో ఉదయం 9.15 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.