లేబర్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుల విభజనకు నోడల్ అధికారి

హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కార్మికశాఖలోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుల విభజన ప్రక్రియ వేగవంతమైంది. విభజన కోసం తెలంగాణ ప్రభు త్వం ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించింది. పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లో అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ క్యాడర్ సామర్థ్య సమాచారాన్ని అప్లోడ్ చేయాలని తెలంగాణ అధికారులకు ఏపీ రీ-ఆర్గనైజేషన్ ముఖ్య కార్యదర్శి ఎల్ ప్రేమచంద్రారెడ్డి లేఖ రాశారు. పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లోని ఫారమ్-3లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారుల వివరాలు పుట్టిన తేదీ, సర్వీసులో చేరిన తేదీతో సహా పూర్తి వివరాలను అప్లోడ్ చేయాలని తెలంగాణ అధికారులను ఆయన కోరారు. ఇప్పటికే రెండు రాష్ర్టాల పరిధిలోకి వచ్చే 87 మంది అధికారుల జాబితాను ఏపీ రూపొందించింది. కాని వాస్తంగా కార్మికశాఖలో మొత్తం 106 అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు ఉన్నారు. వీరిలో 19 మంది ప్రత్యక్ష నియమాకాల ద్వారా వచ్చారు. ఈ మేరకు పునర్వ్యవస్థీకరణ పోర్టల్‌లో ప్రత్యేక లాగిన్‌ను క్రియేట్ చేశారు. యూజర్ ఐడీలను ఇప్పటికే రెండు రాష్ర్టాల లేబర్ కమిషనర్లకు విడిగా కేటాయించారు. పోస్టులకు చెందిన క్యాడర్ స్ట్రెంత్‌ను అప్లోడ్ చేసేందుకు ఐడీ, పాస్‌వర్డ్‌ను నోడల్ అధికారులకు ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

