రాష్ర్టంలో పడకలు, ఆక్సిజన్ కొరత లేదు : పబ్లిక్ హెల్త్ డైరెక్టర్
పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ | రాష్ర్టంలో కొవిడ్ చికిత్సకు పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత లేదు.. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొనసాగుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు

హైదరాబాద్ : రాష్ర్టంలో కొవిడ్ చికిత్సకు పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత లేదు.. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొనసాగుతుందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయంలో శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. కరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలు కూడా కరోనా ముందు మోకరిల్లుతున్నాయి. కరోనా తొలి దశ నుంచి ప్రజలు పాఠాలు నేర్చుకోలేదు. కరోనా వెళ్లిపోయిందనే భ్రమలో జనం ఉన్నారు. మొదటి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకోగలిగాం. ప్రజల్లో అలసత్వం వచ్చింది. గాలి నుంచి వ్యాపించే దశకు కరోనా చేరుకుందని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు.
రాష్ర్టంలో ఎక్కడా బెడ్ల కొరత లేదని, కేవలం 15-20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. 80 శాతం మంది కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవు అని వెల్లడించారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రోజుకు లక్షకు పైగా కొవిడ్ టెస్టులు
రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేవలం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యిందన్నారు. నిన్న ఒక్కరోజే లక్షా 26 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 38 వేలకు పెంచామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బెడ్ల సంఖ్యను 53 వేలకు పెంచుతామని తెలిపారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు.
ఐదుగురి నుంచి 433 మందికి
మహారాష్ర్ట నుంచి ఓ ఉత్సవం నిమిత్తం సరిహద్దు జిల్లాకు మార్చి 24న 20 మంది వచ్చారు. అక్కడ జరిగిన ఆ ఉత్సవంలో సరిహద్దు జిల్లాకు చెందిన మరో 30 మంది పాల్గొన్నారు. వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించగా మరో 34 మందికి కరోనా సోకినట్లు తేలింది. అలా 34 మంది 433 మందికి కరోనా వ్యాపించింది. ఇదంతా కేవలం 12 రోజుల్లోనే జరిగిపోయిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

