కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత లేదు : మంత్రి ఈటల
ఆక్సిజన్ కొరత | కరోనా రోగులకు రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు

నల్లగొండ : సూర్యాపేటలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కలిసి ప్రారంభించారు. రూ. 17 కోట్లతో 250 పడకలతో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కొవిడ్ చికిత్సకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. కరోనా రోగులకు రాష్ర్టంలో ఆక్సిజన్ కొరత లేదని తేల్చిచెప్పారు. ఆస్పత్రుల్లో పడకలు దొరకడం లేదన్న పుకార్లు నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావొద్దు అని సూచించారు. కొవిడ్ రోగుల్లో 5 శాతం మందిలోనే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 99.5 శాతం మంది రికవరీ అవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ టెస్టు పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే కొవిడ్ రోగులకు తెలంగాణ మెరుగైన సేవలందిస్తోంది అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

