TSCAB కీలక నిర్ణయం.. వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు..
TSCAB | తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్( TSCAB ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా టీకా తీసుకోనివారికి జీతాలు ఇచ్చే

హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్( TSCAB ) కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులు కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుంటేనే జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. కరోనా టీకా తీసుకోనివారికి జీతాలు ఇచ్చే ప్రసక్తే లేదని అపెక్స్ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం డిసెంబర్ 4, 2021 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ నిబంధన టీఎస్ సీఏబీ హెడ్ క్వార్టర్స్‌తో పాటు అన్ని బ్రాంచ్‌లకు వర్తిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా టీఎస్ సీఏబీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నేతి మురళీధర్ మాట్లాడారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఉద్యోగి తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పకుండా సంబంధిత వర్గాలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే డిసెంబర్ జీతాలు ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేశారు. ఒక వేళ వ్యాక్సిన్ తీసుకొని యెడల.. కారణాలను తెలుపుతూ రిపోర్ట్ ఇవ్వాలన్నారు. ఈ రిపోర్టులను డిసెంబర్ 15వ తేదీలోపు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. వంద శాతం వ్యాక్సినేషన్‌కు ప్రతి ఉద్యోగి సహకరించాలని ఎండీ నేతి మురళీధర్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

