సొంత జాగాల్లో ఇండ్ల పథకం

- అసైన్ ల్యాండ్స్ సేకరించొద్దని అధికార్లకు చెప్పాను
- గత ప్రభుత్వంలో ఇండ్ల పథకంలో అన్నీ అక్రమాలే
- డబుల్ ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యేల జోక్యం లేదు
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
- జాగాలున్నవారికి ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం
- నియోజకవర్గానికి 1000- 1200 వరకు కట్టిస్తాం
- దటీస్ తెలంగాణ
- దేశంలో అత్యధిక గురుకులాలు కలిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
- బడ్జెట్లో క్యాపిటల్ ఖర్చు ఎక్కువగా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- హోంగార్డులకు అత్యధిక వేతనాలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ అలవెన్స్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- సంక్షేమానికి అధిక మొత్తం వ్యయం చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): సొంత జాగాలు ఉండి ఇండ్లు కట్టుకొనేందుకు ముందుకొచ్చేవారికి ఆర్థిక మద్దతు అందించేందుకు కట్టుబడి ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. త్వరలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం శాసనసభలో సీఎం మాట్లాడారు. ‘సొంత జాగాలున్నవారికి కొంత ఆర్థికసాయం చేస్తే ఇండ్లు కట్టుకొంటారని మా ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా చెప్పాం. ఆ పథకం మీద పని చేస్తున్నాం. కరోనా వల్ల ఆలస్యమైంది. వందశాతం త్వరలో ప్రారంభిస్తాం’ అని స్పష్టంచేశారు. నియోజకవర్గానికి వెయ్యి లేదా 1200 ఇండ్లు.. ఇలా ఎన్ని ఇవ్వాలో ఆలోచిస్తున్నామని తెలిపారు. కొన్ని కాలనీవాసులకు గతంలో 60, 100 గజాలకు సర్టిఫికెట్లు ఇచ్చినా ఇండ్లు కట్టుకొనేందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్తున్నారని, ఈ సమస్య ఎక్కువగా హైదరాబాద్ చుట్టూ ఉన్నదని చెప్పారు. దీనిపై వెంటనే సమీక్షించి, సర్టిఫికెట్ ఉండి, భూమి ఉంటే తక్షణం ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని సీఎస్‌కు చెప్పినట్టు వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం మొత్తం రూ.19,120 కోట్లు విడుదల చేశామని, హైదరాబాద్‌లో 7, 9 అంతస్తుల్లో లిఫ్ట్‌లు పెట్టి ఇండ్లు కడుతున్నామని, ఇలాంటివాటి ధర రూ.11 లక్షలు ఉన్నప్పటికీ పేదలు ఆత్మగౌరవంతో బతకాలని ఖర్చుకు వెనకాడటం లేదన్నారు. గతంలో మంథనిలో 100 మందికి ఇండ్లు అవసరం ఉంటే 140 మందికి మంజూరు చేశారని, అంత ఘోరంగా పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. ‘అందుకే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో ఏ ఒక్క ఎమ్మెల్యే జోక్యం చేసుకోవద్దని చెప్పిన. ‘ఎవరికి వచ్చినా మీ నియోజకవర్గం వారికే వస్తుంది కదా’ అని చెప్పిన’ అని సీఎం తెలిపారు.
అసైన్డ్ ల్యాండ్స్ తీసుకోవద్దని చెప్పిన
అసైన్డ్ ల్యాండ్స్‌ను వీలైనంత వరకూ తీసుకోవద్దని అధికారులకు చెప్పిన. తప్పని పరిస్థితిలో తీసుకుంటే ఇతరులకు ఎంత నష్టపరిహారం ఇస్తరో వారికీ అంత ఇవ్వాలని ఆదేశించిన. వీలైనంత మేరకు తీసుకున్న భూమికి సమానమైన భూమి ఇవ్వాలని చెప్పాం. అనవసరంగా తీసుకుంటే తప్పకుండా నిరోధిస్తం. ఈ విషయంలో నేను భూ యజమానుల వెంట ఉంటా
–సీఎం కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

