తెలంగాణ పథకాలకు నేపాల్ ఫిదా
తెలంగాణ మున్సిపల్‌శాఖ పట్టణాలు, నగరాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు బాగున్నాయని నేపాల్ అధికారుల బృందం ప్రశంసించింది.
- తమ దేశంలోనూ అమలు చేస్తామని వెల్లడి
- సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించిన 24 మంది అధికారుల బృందం
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మున్సిపల్‌శాఖ పట్టణాలు, నగరాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు బాగున్నాయని నేపాల్ అధికారుల బృందం ప్రశంసించింది. ఆయా పథకాలను తమ దేశంలోనూ అమలు చేస్తామని తెలిపింది. 24 మంది సభ్యులతో కూడిన నేపాల్ ప్రతినిధి బృందం శనివారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయాన్ని సందర్శించింది. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్‌ను తిలకించింది. పట్టణాలు, నగరాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాల గురించి మున్సిపల్‌శాఖ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నది. ఈ సందర్భంగా సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ రాష్ట్రంలో అమలవుతున్న పట్టణప్రగతితో పాటు వివిధ కార్యక్రమాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం నేపాల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. మున్సిపల్ నాలెడ్జ్ సెంటర్ నగరపౌరులు, పరిశోధకులు, పట్టణ ప్రణాళిక సంస్థలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రశంసించారు. మున్సిపాలిటీలకు సంబంధించిన గత చరిత్ర అంతా ఒకే దగ్గర దొరకడం అభినందనీయమని కొనియాడారు. నేపాల్ ప్రతినిధి బృందంలో ఆ దేశ వాటర్ సప్లయ్ జాయింట్ సెక్రటరీలు తిరేశ్ఖత్రి, బాల ముకుందశ్రేష్ఠ, శోవకాంత పౌడెల్, ఖాట్మండువ్యాలీ వాటర్ సప్లయ్ మేనేజ్మెంట్ బోర్డు ఈడీ సంజీవ్ విక్రమ్రాణా, మున్సిపల్ ఆసోసియేషన్ ఆఫ్ నేపాల్ అధ్యక్షుడు ఆశోక్‌కుమార్ బైంజుశ్రేష్ఠ, ప్రధాన కార్యదర్శి బిమ్ప్రసాద్ దుంగానా, వివిధ పట్టణాల మేయర్లు నగేశ్ కోయిరాలా, మీనాకుమారి లామా, ధన్‌రాజ్ ఆచార్య, మోహన్ మాయా బండారి, గోపాల్హమాల్ ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | ఫాలోఆన్ తప్పినా.. ఆలౌట్తో భారత్‌కు కష్టాలు!
Deeksha Divas | కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఆ 11 రోజులు ఉత్కంఠ పోరాటం..
CV Anand | ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అలర్జీ.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Delimitation | అసెంబ్లీ సీట్ల గరిష్ఠ పరిమితి 650కి పెంపు.. లోక్‌సభలో 80 నుంచి 120కి స్థానాల పెంపు
Delimitation | పట్టణాలదే పెత్తనం.. నియోజకవర్గాల పునర్విభజనతో భారీ మార్పులు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

