హైదరాబాద్ జూలై 6 (నమస్తే తెలంగాణ): నీట్‌కు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆడియో బుక్- ఆకాశ్ ఆడిప్రిప్‌ను ఆకాశ్, బైజూస్ సంస్థలు బుధవారం విడుదల చేశాయి. దేశంలో నీట్ అభ్యర్థుల కోసం రూపొందించిన సమగ్రమైన తొలి ఆడియో బుక్‌గా ఆ సంస్థలు పేర్కొన్నాయి. ఆడియో బుక్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ కరిక్యులమ్‌కు సంబంధించిన పూర్తి అంశాలు ఉంటాయని తెలిపాయి. క్లాస్ 11, క్లాస్ 12 విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని వెల్లడించాయి. ఏ సమయంలో అయినా పాఠ్యాంశాలను మననం చేసుకొనే వెసులుబాటు ఉన్న ఆడియో బుక్ ద్వారా నీట్‌ను విద్యార్థులు సులభంగా అధిగమించవచ్చని తెలిపాయి.