ఇచ్చోడ, జూలై 5 : ఆదిలాబాద్ జిల్లా ముక్రా(కే) మాజీ సర్పంచ్ మీనాక్షి మహిళా నాయకత్వానికి స్ఫూర్తిదాయకమని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ విజయ రహతర్ కొనియాడారు. ఆదివారం ట్విట్టర్(ఎక్స్)లో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అకౌంట్లో మాజీ సర్పంచ్ మీనాక్షిని సన్మానిస్తున్న ఫొటోను పోస్ట్చేశారు.
ముక్రా(కే) గ్రామం పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, సౌరశక్తి, పర్యావరణ పరిరక్షణ రంగాల్లో విశేషమైన విజయాలు సాధించించి.. తెలంగాణలోని పరిశుభ్రమైన, ఆదర్శ గ్రామాల్లో ఒకటిగా నిలిచిందని గుర్తుచేశారు.