బీసీలకు కేంద్రం తీరని ద్రోహం
దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు.
- జాతీయ బీసీ కమిషన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
- బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): దేశంలోని బీసీలకు జాతీయ బీసీ కమిషన్ తీరని అన్యాయం చేస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా 80 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలన్న నిర్ణయాన్ని సోమవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. కేంద్ర నిర్ణయం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర జాబితాలో ఉండి, కేంద్ర జాబితాలో లేని కులాలను కలిపితే ఎవరికీ, ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ, అర్హత లేని కులాలను ఓబీసీ జాబితాలో కలపడం సమంజసం కాదని వివరించారు.
అదే జరిగితే బీసీల ఆగ్రహాన్ని కేంద్రం త్వరలోనే చూస్తుందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా బీసీలకు ఎలాంటి పథకాలు అమలులో లేవని, 2023-24 కేంద్ర బడ్జెట్లో ఓబీసీలకు కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడం బీసీలపై కేంద్రానికి ఉన్న చిన్నచూపునకు నిదర్శనమని మండిపడ్డారు. ఇకనైనా జాతీయ కమిషన్ తన నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

