చిత్రంలో కనిపిస్తున్నది రంగుల బంతి అనుకుంటున్నారా? కాదు ఇది సూర్య కుటుంబంలోని ప్లూటో గ్రహం! మరి ఇది ఇలా ఎందుకు ఉన్నది? మంచుతో కప్పబడి ఒకే రంగులో ఉండే గ్రహం ఇలా రంగుల్లో కనువిందు చేయడమేంటి? అనుకుంటున్నారా.. న్యూ హారిజన్స్ శాస్త్రవేత్తలు ప్లూటో ఉపరితంపై ఉన్న భిన్నమైన ప్రాంతాలను వేర్వేరు రంగుల్లో చూపారు.
దీంతో ఇంద్ర ధనుస్సులోని అన్ని రంగులను తనలో నింపుకొని ఇలా చూడముచ్చటగా కనిపిస్తున్నది. ఈ ఫొటోను నాసా శుక్రవారం విడుదల చేసింది.