SI Praveen | ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళతో అసభ్యప్రవర్తన.. శాలిగౌరారం ఎస్ఐ ప్రవీణ్‌పై బదిలీవేటు
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్‌ను (SI Praveen) వీఆర్‌కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదులును నియమించారు.
నల్లగొండ: ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్‌ను (SI Praveen) వీఆర్‌కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్ఐగా సైదులును నియమించారు. ఎస్ఐ ప్రవీణ్ తనను వేధిస్తున్నాడంటూ శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన బెల్లి నిఖిత పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లా ఎస్పీకి సోమవారం ఎస్పీకి వినతిపత్రం అందించారు. దీంతో ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు.
కాగా, కేసు విచారణ నిమిత్తం స్టేషన్‌కి పిలిపించి టీ పెట్టించారని.. చికెన్ ఫ్రై, చేపల కూడా వండటం వస్తే బయట కలుద్దామంటూ ఫోన్ చేయడంతో పాటు వాట్సాప్ మెసేజ్ చేశాడంటూ బాధితురాలు ఆరోపించారు. విచారణ పేరుతో గంటన్నర సేపు తన రూమ్‌లో నిలబెట్టి నానా మాటలు అన్నాడని చెప్పారు. ఏదన్నా ఉంటే పర్సనల్‌గా ఫోన్ చేయమన్నాడని తెలిపారు. ఇక్కడి విషయాలు ఎవరికన్నా చెప్తే తనతో పాటు కుటుంబానికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడని పేర్కొన్నారు. తనపైనే కుల సంఘాల నేతలతో దుష్ర్పచారం చేయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

