Nalgonda: ఎంజీయూను సందర్శించిన నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు

రామగిరి: విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి పెంచాలనే సంకల్పంతోనే యూనివర్సిటీల్లో సెమినార్లు, రీసెర్చ్ ప్రాజెక్టులను నిర్వహించాలని ఎంజీయూ వీసీ ప్రొ. సీహెచ్.గోపాల్‌రెడ్డి వెల్లడించారు. నాగపూర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధులు సోమవా రం ఎంజీయూను సందర్శించారు. దీనిలో భాగంగా ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో ఆ ప్రతినిధులు, వర్సిటీ కళాశా లల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్స్‌తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతికి పరిశోధనలు బాగా తోడ్పడుతాయన్నారు.
పరిశోధనలు చేస్తే పరిజ్ఞానంతో పాటుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అనుసంధానించుకోని ప్రపంచ స్థాయి పరిశోధనలు నిర్వహించవచ్చన్నారు. దీనివల్ల విద్యార్థులు వ్యక్తిగతంగా లాభ పడటమే కాకుండా యూనివర్సిటీ పేరుప్రతిష్టలు పెరుగు తాయని ఆ దిశగా ఫ్యాకల్టీ పనిచేయాలన్నారు. ఇందుకు రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతి నిధులతో అనుసందానంగా ఉండి ముందుకు సాగాలన్నారు.

నాగపూర్ రీసెర్చ్ ఫౌండే షన్ ప్రతినిధులు మీనా చంద్రావర్కార్, నేషనల్ ఆర్గనైజేషన్ కార్యదర్శి శంకర్ ఆనంద్ మాట్లా డుతూ సంస్థ ఇప్పటికే వంద యూనివర్సిటీలతో విద్యాభివృద్ధి అంశాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ సైంటిఫిక్ టెక్నాలజీ అకడామిక్ రీసెర్చ్ వంటి విషయాల్లో సహకరిస్తామని ఇది ఒక సైంటిఫిక్ కమ్యూనిటీ అనుసంధానం చేస్తుందన్నారు.
కార్యక్రమంలో రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు అజయ్రావ్ల్, డా. మాని, భువనేశ్వర్ దిగ్విజయ్‌సింగ్, ఎంజీయూ యూనివర్సిటీ కళాశాలల ప్రిన్సిపాల్స్ డా. అంజిరెడ్డి, సంధ్యారాణి, పాలకమండలి సభ్యులు డా. ఆకుల రవి, శ్రీదేవి, కన్వీనర్స్ డా. వై.ప్రశాంతి, రామచందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

