కార్పొరేట్ సెలూన్లను నిషేధించాలి
ప్రభుత్వం తక్షణం రాష్ట్రంలో కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటును నిషేధించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు.
-
నాయీబ్రాహ్మణ సంఘం
హైదరాబాద్, నవంబర్14 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తక్షణం రాష్ట్రంలో కార్పొరేట్ సెలూన్ల ఏర్పాటును నిషేధించాలని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ డిమాండ్ చేశారు. తద్వారా కులవృత్తిని ఆదుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్రెడ్డి ఇతర కులాలవాళ్లు, తమతోపాటుగా అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు సైతం మంగళి పని చేస్తున్నారని, కటింగ్ షాపులు పెట్టుకుంటున్నారని చెబుతూ వస్తున్నారని వివరించారు.
సీఎం వ్యాఖ్యల అనంతరం అనేకమంది ఇతర కులస్తులు, కార్పొరేట్ శక్తులు మంగళి వృత్తిలోకి వస్తున్నాయని మండిపడ్డారు. కులవృత్తినిమ్ముకున్నవాళ్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ప్రమాదం ఏర్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని, ఇతర కులాలు, కార్పొరేట్ శక్తులు సెలూన్లు ఏర్పాటు చేయకుండా జీవో తీసుకువచ్చి నిషేధించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాయీబ్రాహ్మణులకు ఎలాంటి అవకాశాలు, లోన్లు లేకుండా పోయాయని, మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు బడ్జెట్ను ఇవ్వకపోవడం వల్ల అధికారులు కరెంట్ బిల్లులతో ఇబ్బం దిపెడుతున్నారని, కనెక్షన్లను కట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఇకనైనా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, లేకుంటే బుద్ధి చెప్తామని హెచ్చరించారు. బాటసింగారలో నాయీబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి కేసీఆర్ రెండు ఎకరాలు ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క ఇటుక పెట్టలేదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

