నాదర్గుల్ రైతుల గోసయాత్ర.. రంగారెడ్డి కలెక్టరేట్‌కు 14కిలోమీటర్ల పాదయాత్ర
నాదర్గుల్ రైతుల న్యాయపోరాటం కొనసాగుతూనే ఉన్నది. కాస్బాగ్ భూముల సమస్యను పరిష్కరించాలని 82రోజులుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు, వంటావార్పు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు.
- కాస్బాగ్ భూముల సమస్యను పరిష్కరించాలి
ఆదిబట్ల, జూన్ 15 : నాదర్గుల్ రైతుల న్యాయపోరాటం కొనసాగుతూనే ఉన్నది. కాస్బాగ్ భూముల సమస్యను పరిష్కరించాలని 82రోజులుగా వివిధ రూపాల్లో ధర్నాలు, నిరసనలు, వంటావార్పు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడంతో సోమవారం భారీ పాదయాత్ర నిర్వహించారు. చలో కలెక్టరేట్ పేరుతో సుమారు 14కిలోమీటర్ల మేర నడుచుకుంటూ నాదర్గుల్ నుంచి రంగారెడ్డి కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేశారు.
రైతులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలతో హోరెత్తించారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఈ పాదయాత్రను రైతుల గోసయాత్రగా నిర్వహించినట్టు వారు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డికి వినతిపత్రం అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

