మూడేండ్లు న్యాక్ – ఏ గ్రేడ్‌తో డీమ్డ్ హోదా
న్యాక్ - ఏ గ్రేడ్‌ను వరుసగా మూడుసార్లు పొందిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాను దక్కించుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొత్తం కోర్సుల్లోని మూడింట రెండో వంతు కోర్సులు ఎన్బీఏ గుర్తింపు లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఏదేనీ క్యాటగిరీలో టాప్ 50లోపు నిలిచిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాకు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు
- యూజీసీ మార్గదర్శకాలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే డీమ్డ్ హోదా రద్దు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): న్యాక్ – ఏ గ్రేడ్‌ను వరుసగా మూడుసార్లు పొందిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాను దక్కించుకోవచ్చని యూజీసీ తెలిపింది. మొత్తం కోర్సుల్లోని మూడింట రెండో వంతు కోర్సులు ఎన్బీఏ గుర్తింపు లేదా ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో ఏదేనీ క్యాటగిరీలో టాప్ 50లోపు నిలిచిన విద్యాసంస్థలు డీమ్డ్ వర్సిటీ హోదాకు దరఖాస్తు చేసుకోవచ్చని యూజీసీ చైర్మన్ మామిడాల జగదీశ్‌కుమార్ వెల్లడించారు.
డీమ్డ్ వర్సిటీల ఏర్పాటుకు వీలు కల్పిస్తూ 2019లో మార్గదర్శకాలు జారీచేసిన యూజీసీ.. తాజాగా నూతన జాతీయ విద్యావిధానం అమల్లోకి రావడంతో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే వాటితోపాటు ఇప్పటికే నడుస్తున్న డీమ్డ్ వర్సిటీలు కూడా ఈ నిబంధనలను పాటించాలని యూజీసీ ప్రకటించింది.
మార్గదర్శకాలు ఇవీ..
- డీమ్డ్ వర్సిటీల ఏర్పాటు, నిర్వహణ అంతా సెంట్రల్ యూనివర్సిటీల తరహాలో ఉంటున్నది.
- మల్టీ డిసిప్లినరీ విద్యాసంస్థలు కనీసం 5 యూజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్, రిసెర్చ్ డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. క్లస్టర్ విద్యాసంస్థలు అదే నగరంలో 5 డిపార్ట్మెంట్లను కలిగి ఉంటే డీమ్డ్ వర్సిటీకి దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఏ గ్రేడ్ అంత కంటే ఎక్కువ గ్రేడ్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో 1 నుంచి 100 స్థానాల్లో నిలిచిన విద్యాసంస్థలు.. క్యాంపస్‌ల సెంటర్లు ప్రారంభించుకొనేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- డీమ్డ్ హోదా ఉన్న వర్సిటీలు సంబంధిత సబ్జెక్టుల్లో ఆఫ్ షోర్ క్యాంపస్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చు.
- వర్సిటీ అకౌంట్ పుస్తకాలను డీమ్డ్ వర్సిటీ పేరుతోనే నిర్వహించాలి.
- నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తారు. కోర్సులు మూసివేస్తారు. అయినా తరుచుగా ఉల్లంఘిస్తే డీమ్డ్ వర్సిటీ హోదాను ఉపసంహరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

