నా విజయం అమరులకు అంకితం
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
- శాసనమండలి సభ్యునిగా ప్రమాణం
హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డి గురువారం ప్రమాణం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. అనంతరం నవీన్‌కుమార్‌రెడ్డిని మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు బీఆర్ఎస్ ప్రముఖులు కూడా నవీన్‌రెడ్డిని అభినందించారు. అనంతరం నవీన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మహబూబ్‌నగర్ రేవంత్‌రెడ్డి అడ్డా కాదని కేసీఆర్ అడ్డా అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరోసారి నిరూపించారని అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
తనను ఆశీర్వదించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, మాజీ మంత్రి టీ హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పనిచేశానని, ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యానని.. స్థానిక సంస్థల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తన విజయాన్ని అమరవీరులకు అంకితం చేస్తున్నానని తెలిపారు. నవీన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో మాజీ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎస్ నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, సీ లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీలు వాణీదేవి, శేరి సుభాష్‌రెడ్డి, విఠల్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చారు.
తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం…
పట్టభద్రుల స్థానం నుంచి ఎన్నికైన చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న) కూడా ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షి, ఎంపీ చామల కిరణ్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

