Munugode by poll results | మునుగోడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ పయణిస్తున్నది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. రౌండ్ రౌండ్‌కు తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నది. ఎనిమిది రౌండ్లు ముగిసే సరికి 3091 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నది. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్కు 6624 ఓట్లు పోలవగా, బీజేపీకి 6088 ఓట్లు వచ్చాయి. దీంతో ఎనిమిదో రౌండ్లో కారు గుర్తుకు 536 ఓట్లు అధికంగా వచ్చాయి. ప్రస్తుతం తొమ్మిదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగతున్నది.
ఇప్పటివరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. రెండు, మూడు రౌడ్లలో మినహా మిగిన అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.