Munugode bypoll results: మునుగోడులో గెలుపు దిశగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. తొలిరౌండ్ నుంచి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్.. ఆరు రౌండ్లు ముగిసే సరికి 2169 ఓట్ల మెజార్టీలో ఉన్నది. ఆరో రౌండ్లో పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 6016 ఓట్లు పోలవగా, బీజేపీకి 5378, కాంగ్రెస్ పార్టీకి 1831 ఓట్లు వచ్చాయి. ఆరో రౌండ్లో తన సమీప ప్రత్యర్థి కంటే కూసుకుంట్ల 638 ఓట్లు అధికంగా సాధించారు. ప్రస్తుతం ఏడో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఇప్పటివరకు 95 ఓట్ల లెక్కింపు పూర్తవగా, మరో లక్షా 30 ఓట్లు లెక్కించాల్సి ఉన్నది.