Munugode By polls Results | మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతున్నది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు గుర్తు దూసుకువెళ్తున్నది. ఇప్పటి వరకు 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం వైపు దూసుకువెళ్తున్నారు. రౌండ్ రౌండ్‌కు టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యం పెరుగుతున్నది. మొదటి రౌండ్లో టీఆర్ఎస్, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. ఆ తర్వాత నాలుగో రౌండ్ నుంచి 12వ రౌండ్లు ముగిసే వరకు 7,807 ఓట్ల ఆధిక్యం టీఆర్ఎస్ అభ్యర్థికి లభించింది. ఈ రౌండ్లో 7,440 ఓట్లు, బీజేపీకి 5,398 ఓట్లు లభించాయి. ప్రస్తుతం 1.80లక్షల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. మరో వైపు కూసుకుంట్ల విజయం దాదాపు ఖరారుకావడంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుతున్నాయి.