గ్రీన్ ఛాంపియన్గా నిలిచిన ములుగు ఫారెస్ట్ కాలేజీ
ములుగు ఫారెస్ట్ కాలేజీ | సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ( FCRI ) కు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని ములుగు అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ( FCRI ) కు మరో గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో స్వచ్ఛత, పచ్చదనం పోటీలో ములుగు ఫారెస్ట్ కాలేజీ గ్రీన్ ఛాంపియన్గా నిలిచింది. మహాత్మా గాంధీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రూరల్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఒక జిల్లా – ఒక పచ్చని విజేత (One District – One Green Champion) అవార్డును ములుగు ఫారెస్ట్ కాలేజీ సాధించింది.
జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో ఒక్కో జిల్లా నుంచి ఒక సంస్థను పరిశుభ్రత, పచ్చదనం పెంపు నిర్వహణ బాగా చేస్తున్న వాటిని గుర్తించారు. దీనిలో భాగంగా సిద్దిపేట జిల్లా నుంచి ములుగులో ఉన్న అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ అవార్డును దక్కించుకుంది. కొత్త క్యాంపస్ ఏర్పాటైన ఏడాది కాలంలోనే స్వచ్చత, పచ్చదనంలో ఫారెస్ట్ కాలేజీ గణనీయమైన వృద్దిని సాధించింది. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు ఈ ఘనతలో భాగస్వామ్యం అయ్యారు. జాతీయ స్థాయిలో ఈ గుర్తింపుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహం, ఫ్యాకల్టీ, విద్యార్థుల పట్టుదల కారణమని ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీన్ అన్నారు. మరో సారి ఫారెస్ట్ కాలేజీకి జాతీయస్థాయి గుర్తింపు దక్కడంతో డీన్, సిబ్బంది, విద్యార్థులను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్. శోభ అభినందించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్పై దాడి..!
రెడ్ డ్రెస్లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్లో అదరగొట్టిన భామ!
Congress | కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్ల దందా? పనికో రేటు.. సిఫారసు లేఖకో రేటు!
United Nations: మానవ హక్కుల నిపుణుల ఆందోళన.. ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండించిన భారత్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

