ఇచ్చోడ, అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ పిలుపు మేరకు హరిత నిధికి తోడ్పాటునందించేందుకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ పంచాయతీ ముందుకొచ్చింది. పంచాయతీ తరఫున ప్రతి నెలా రూ. 2 వేలు ఇవ్వాలని గురువారం పాలకవర్గం తీర్మానించింది. అదీగాక సర్పంచ్‌తోపాటు ఎంపీటీసీ సభ్యుడు తమ గౌరవ వేతనాల నుంచి రూ.500 చొప్పున ప్రతి నెలా ఇవ్వనున్నట్టు ప్రకటించారు.