ఇంధనం, గ్యాస్ కొరత రాకుండా చూడాలి
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్ సహా వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ భవనంలో బుధవారం పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశం జరిగింది.
- పార్లమెంటరీ కమిటీ మీటింగ్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత, ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో క్రూడాయిల్, పెట్రోల్, డీజిల్ సహా వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి విఘాతం కలుగకుండా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ముందస్తు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు. ఢిల్లీ పార్లమెంట్ ప్రాంగణంలోని అనెక్స్ భవనంలో బుధవారం పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశం జరిగింది.
కమిటీ చైర్మన్ సునీల్ దత్తాత్రే తటరే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర, అంతర్జాతీయ పరిణామాల వల్ల దేశీయ ఇంధన మారెట్ ప్రభావితం కాకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుత విజయదశమి, దీపావళి పండుగల సమయంలో సాధారణ ప్రజలు, గృహిణులకు ఇబ్బందుల్లేకుండా వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ అయ్యేలా చూడాలని కోరారు.
అదే సమయంలో పెట్రోలియం రంగంలో వృథా, వ్యర్థాలను అరికట్టడంతోపాటు డిపోలు, ప్లాంట్లలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా భద్రతా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. సమావేశంలో ఉన్నతాధికారులు, చమురు సంస్థల ప్రతినిధులు, స్థాయీసంఘ సభ్యులు విస్తృతంగా చర్చలు జరిపారు. పెట్రోలియం పార్లమెంటరీ స్థాయీసంఘం చైర్మన్గా తిరిగి నియమితులైన సునీల్ దత్తాత్రే తటరేకు ఎంపీ రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపారు. దేశ ఇంధన భద్రత, సామాన్య పౌరుల ప్రయోజనాల దృష్ట్యా చమురు సంస్థలు నిరంతరం కార్యాచరణతో ముందుకు సాగాలని ఈ భేటీలో నిర్ణయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

