మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
పేగుబంధం పాషాణ హృదయమైంది. రక్తబంధం రాతిబంధమైంది. మమకారం మంటగలిసింది. నవమాసాల బంధం నడిసాగరంలో కలిసింది. కన్నతల్లే కాలయమురాలై పేగు తెం చుకొని పుట్టిన ఆరేండ్ల చిన్నారి కూతురును కడతేర్చబోయింది. కనిపెంచిన చేతులతోనే చెరువులోకి విసిరిపారేసి, అక్కడి నుంచి కనుమరుగైంది.
- నీటిలో నుంచి కాపాడిన ఆటోడ్రైవర్
- గాంధీ దవాఖానలో వైద్యచికిత్స
- నిలకడగానే ఉన్న బాలిక ఆరోగ్యం
- అమ్మీ కావాలంటూ చిన్నారి రోదన
- పోలీసుల అదుపులో తల్లి షబానా?
బేగంపేట్ అక్టోబర్ 9/కవాడిగూడ : పేగుబంధం పాషాణ హృదయమైంది. రక్తబంధం రాతిబంధమైంది. మమకారం మంటగలిసింది. నవమాసాల బంధం నడిసాగరంలో కలిసింది. కన్నతల్లే కాలయమురాలై పేగు తెం చుకొని పుట్టిన ఆరేండ్ల చిన్నారి కూతురును కడతేర్చబోయింది. కనిపెంచిన చేతులతోనే చెరువులోకి విసిరిపారేసి, అక్కడి నుంచి కనుమరుగైంది. కన్నతల్లి కఠిన నిర్ణయంతో మానవీయ సంబంధాలు కనుమరుగు అవుతున్నాయనడానికి నిదర్శనంగా నిలిచింది ఈఘటన ఆ కఠినాత్మురాలు చిన్నారిని చెరువులోకి విసురుతుండగా చూసిన ఓ ఆటోడ్రైవర్ దేవుడిలా వచ్చి నీటిలో నుంచి ఆ చిన్నారిని కాపాడి పోలీసులకు అప్పగించాడు.
అనారోగ్య సమస్యలతో ఉన్న కూతురుకు వైద్యం చేయించలేకే ఆ బాలికను హుస్సేన్‌సాగర్ నీటిలోకి తోసిందని కొందరు భావిస్తున్నా.. అసలు విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అల్వాల్ ప్రాంతానికి చెందిన షబానా తన ఆరేండ్ల వయసున్న కూతురు రుక్సానాతో కలిసి గురువారం ట్యాంక్‌బండ్‌పైకి చేరుకున్నది. ఎవరూ లేని సమయం చూసి బాలిక రుక్సానను హుస్సేన్‌సాగర్ నీటిలోకి తోసి అక్కడి నుంచి పరారైంది. ఈ విషయాన్ని గమనించిన ఓ ఆటోడ్రైవర్ నీటిలో నుంచి ఆ పాపను కాపాడి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న దోమలగూడ పోలీసులు ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల అదుపులో చిన్నారి తల్లి షబానా
చిన్నారి రుక్సానా తల్లి షబానాను అదుపులోకి తీసుకున్న దోమలగూడ పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటకొచ్చినట్టు తెలుస్తున్నది. అల్వాల్ ఓల్డ్బోయన్పల్లి హస్మత్‌పేటలో నివాసముండే రాయలసీమకు చెందిన రహమాన్, షబానాలకు 15 ఏండ్ల క్రితం క్రితం వివాహం జరిగింది. వీరికి మహేక్(9), రుక్సానా (6) ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. హోటళ్లలో కుక్మాన్గా పనిచేసే రహమాన్ ఐదేండ్ల క్రితం షబానాను వదిలి వెళ్లిపోయాడు. వారి చిన్నకూతురు రుక్సానాకు పుట్టుకతోనే మలద్వారం లేకపోవడంతో గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రుక్సానాకు పొట్ట భాగంలో పేగును బయటకు తీసి మల విసర్జన జరిగేలా చికిత్స అందించారు. ఒక వయస్సు వచ్చేంతవరకూ రుక్సానాకు పూర్తిస్థాయి చికిత్స చేయడం కుదరదని, అప్పటివరకు ఇతర చికిత్సలు చేయించుకోవాలని కుటుంబసభ్యులకు సూచించారు.
భర్త వదిలేయడంతో ఇండ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తున్న షబానా.. చిన్నారి రుక్సానాకు వైద్య చికిత్సలు చేయించలేక విసుగు చెంది హుస్సేన్‌సాగర్‌లో తోసేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. షబానా భర్త రహమాన్ ప్రస్తుతం గుంటూరులోని ఓ హాస్టల్లో పనిచేస్తున్నట్టు దోమలగూడ సీఐ అంజద్‌అలీ తెలిపారు. చిన్నారికి శస్త్రచికిత్స జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు పోలీసులు తెలిపారు. ‘మా అమ్మీ ఎక్కడ? మా అమ్మ నన్ను వదిలేసి ఎక్కడికి పోయింది? మా అమ్మీ కావాలి’ అంటూ పాపం ఆ చిన్నారి దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నది. కండ్లన్నీ ఎర్రగా మారి దీనంగా తల్లి రాక కోసం ఎదురుచూస్తున్నది. ఎటుచూసినా తల్లి కనిపించకపోవడంతో దవాఖాన బెడ్డుపై కూర్చొని అమ్మ కోసం చిన్నబోయి బెంగటిల్లి చూస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంటగలిసిన పేగుబంధం.. ఆరేండ్ల చిన్నారి కూతురును హుస్సేన్‌సాగర్‌లోకి విసిరిన మహిళ
ఓటర్ల మొగ్గు.. బీఆర్ఎస్ వైపు.. చాణక్య స్ట్రాటజీస్ ఎండీ ముకేశ్
వారంలోగా భూసేకరణ చేసి పరిహారమివ్వండి.. అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ చర్యలు తప్పవు
ముగిసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్ బృందం యూరప్ పర్యటన
అప్పీలులో దాఖలుకు 250 రోజులా?.. రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు.. విద్యాశాఖకు 25 వేలు జరిమానా
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

