రాష్ట్ర సరిహద్దుల్లోనే కేసులు ఎక్కువ

- పక్కరాష్ర్టాల నుంచి రాకపోకలే కారణం
- హెలికాప్టర్లో వైద్యాధికారుల పర్యటన
- సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లాలపై నిఘా
- కొవిడ్ పరిస్థితులపై సర్కారుకు నివేదికలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ర్టాల నుంచి ఉన్న రాకపోకల వల్ల ఇక్కడా కొత్త కేసులు పెరిగాయి.
లౌక్‌డౌన్ ఎత్తివేశాక మళ్లీ కేసులు పెరిగే అవకాశం ఉంటుంది. పడక్బందీ చర్యలు తీసుకోవాలి’అని జిల్లా అధికారులను ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల బృందం ఆదేశించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు సరిహద్దు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ జిల్లాల్లో పరిశీలన జరిపేందుకు హెలికాప్టర్లో వెళ్లాలని సూచించడంతో.. రెండురోజులగా హెలికాప్టర్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ ప్రాంతాల్లో పర్యటించగా, శుక్రవారం జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో పర్యటించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ,డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ జీ శ్రీనివాసరావు, ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి, సీఎంవో ఓఎస్డీ డాక్టర్ గంగాధర్ ఈ బృందంలో ఉన్నారు.
ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా వైద్యాధికారులు, మెడికల్ ఆఫీసర్లతో సమీక్షలు జరిపారు. కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయి, కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై ఆరాతీశారు. పెద్దసంఖ్యలో పరీక్షలు చేపట్టాలని, ప్రజల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. రెండువారాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా కృషిచేయాలని, సూచించారు. పర్యటనలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ‘ఏపీ సరిహద్దు జిల్లాల్లో పర్యటిస్తున్నాం. కొన్ని జిల్లాలు సెన్సిటివ్జోన్లో ఉన్నాయి. అక్కడ కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. మూడురోజుల కిందట సత్తుపల్లి, మధిర, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో పర్యటించాం. ఏపీలో కేసులు ఎక్కువగా ఉన్నాయి. సరిహద్దు జిల్లాల్లో కేసుల పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం’అని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ జీ శ్రీనివాసరావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

