అమ్మను అర్థం చేసుకోవట్లే.. 50 శాతానికిపైగా పిల్లలకు తల్లుల ఇష్టాలేంటో తెలియదు
సృష్టికి జీవం పోసినది.. అమ్మ. సకల చరాచర జీవజాతులలో కొలువుదీరినది.. అమ్మ. అంత గొప్ప మాతృమూర్తిని కన్నబిడ్డలు సరిగా అర్థం చేసుకోవటం లేదట.
- ఆమె విజయాలు, కోరికలు చెప్పలేకపోయిన 72% మంది
- చదువులో ఎక్కువ మార్కులొస్తే చాలు.. అమ్మ హ్యాపీ!
- మధ్య తరగతి పిల్లల అభిప్రాయమిది.. యూవోహెచ్ అధ్యయనం
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): సృష్టికి జీవం పోసినది.. అమ్మ. సకల చరాచర జీవజాతులలో కొలువుదీరినది.. అమ్మ. అంత గొప్ప మాతృమూర్తిని కన్నబిడ్డలు సరిగా అర్థం చేసుకోవటం లేదట. ఉమ్మడి కుటుంబాలు క్షీణించి, చిన్న కుటుంబాలు పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లీబిడ్డల మధ్య అనురాగం ఏ స్థాయిలో ఉన్నదని తెలుసుకొనేందుకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంటర్ ఫర్ హెల్త్ అండ్ సైకాలజీ ప్రొఫెసర్ మీనా హరిహరన్ నాయకత్వంలోని బృందం పరిశోధన చేయగా.. పలు ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి గురించి పిల్లలు ఏమనుకొంటున్నారు? అమ్మకు ఏం ఇష్టం, ఇష్టం లేనిది ఏంటి? అమ్మ ఏం చేస్తే ఆనందంగా ఉంటుంది? ఆమె కోరికలు ఏమిటి? సాధించిన విజయాలు పిల్లలకు తెలుసా? అన్న అంశాలపై రెండేండ్ల పాటు మధ్య తరగతి కుటుంబాల్లోని 10- 20 ఏండ్ల వయసు వారిని ప్రశ్నించారు. అందులో 50 శాతానికిపైగా పిల్లలకు తల్లుల ఇష్టాలే తెలియదని తేలింది.
అమ్మకు మార్కులే ముఖ్యమనే అభిప్రాయం
మధ్యతరగతి కుటుంబాల్లోని పిల్లల్లో అత్యధికులు.. ‘మేం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొంటే, చదువులో బాగా రాణిస్తే మా అమ్మ ఆనందపడుతుంది. అమ్మ ఆనందానికి ఇంకోటి అవసరం లేదు. మార్కులు, చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇవి చేస్తే చాలు మా అమ్మకు’ అనే అభిప్రాయంతో ఉన్నారు. మా అమ్మకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏం చేస్తే ఆనందపడుతుంది? మా అమ్మకూ ఎమోషన్స్ ఉంటాయి కదా అని అర్థం చేసుకొనే స్థితిలో పిల్లలు లేరని ఈ పరిశోధనలో వెల్లడైంది. తల్లుల గురించి సరైన అవగాహన లేకే తల్లిదండ్రులకు ఏది ఆనందాన్నిస్తుంది? వారికి సంతృప్తిని ఇచ్చేది ఏంటి? అనేది పిల్లలు అంచనా వేయలేకపోతున్నారని, భవిష్యత్తులో తల్లిదండ్రుల గురించి ఆలోచించటమే మానేసే పరిస్థితి తలెత్తుతుందని అధ్యయనం పేర్కొన్నది.
కారణాలివే..
మధ్య తరగతి కుటుంబాల్లో గత కొన్ని దశాబ్దాలుగా వచ్చిన మార్పే ఇందుకు కారణం. పిల్లలకు అమ్మ మార్కులు తెప్పించే యంత్రంగా మారిపోయింది. కూర్చొబెట్టి చదివిస్తుంది. ట్యూషన్‌కు వెళ్లేలా, హోం వర్క్ చేసేలా చూస్తుంది. పరీక్షల్లో మార్కులు వచ్చాయా? లేదా? అన్నది చూస్తుంది. పేరెంట్స్ మీటింగ్‌కు వెళ్తుంది. మార్కులు తక్కువ వస్తే కోపం చేస్తుంది. ఎక్కువ వస్తే మెచ్చుకుంటుంది. అందుకే తల్లి మార్కులు రప్పించేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది పిల్లలు అనుకొంటున్నారు. అది తప్ప పిల్లలకు వేరేది అర్థం కావటం లేదు. మాతాశిశు సంబంధాల్లోని అద్భుతమైన మానవీయత, ఔన్నత్యాన్ని నేటితరం తెలుసుకోలేకపోతున్నదని ఈ పరిశోధన ఆందోళన వ్యక్తం చేసింది.
పరిశోధన సాగిందిలా..
అమ్మకు సంబంధించిన విషయాలపై 37కు పైగా ప్రశ్నల టూల్‌ను పరిశోధన బృందం పిల్లలకు అందించింది. పిల్లలకు సంబంధించిన ప్రశ్నలను కూడా తల్లులను అడిగింది. అయితే ఈ రెండు వర్గాల నుంచి వచ్చిన సమాధానాలు భిన్నంగా ఉన్నాయి. పిల్లల విషయంలో అమ్మకు ఉన్న స్పష్టత.. తల్లి విషయంలో పిల్లలకు లేదు.
- పిల్లల్లో 64.62 శాతం మంది అమ్మకు సంబంధించిన కనీస సమాచారం చెప్పగలిగారు.
- అమ్మ ఆరోగ్య విషయాలపై 76.73 శాతం మందికి కొంతవరకు అవగాహన ఉన్నది.
- 50 శాతం కంటే తక్కువ మంది అమ్మకు నచ్చేది, నచ్చనిది ఏమిటనేది చెప్పగలిగారు.
- అమ్మకు ఉన్న ఎమోషన్స్ ఏమిటని అడిగిన ప్రశ్నకు 60% మంది దగ్గర సమాధానం లేదు.
- మీ అమ్మ సాధించిన విజయాలు, ఆమెకు ఉన్న కోరికలు ఏమిటని అడిగితే 72 శాతం మంది ఎలాంటి సమాధానం చెప్పలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Mothers
- mothers like
- UoH
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

