Polytechnic | వామ్మో పాలిటెక్నిక్.. మా వల్ల కావట్లే.. పరీక్షలంటేనే జంకుతున్న విద్యార్థులు!
పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నిక్కా..! అంటున్నారు. సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తిచేసిన వారే చేరతారు.
- డిప్లొమా కోర్సుల్లో నెలకో పరీక్ష.. నెలకో రిజల్ట్స్
- లెక్చరర్లకు సమస్యగా మారిన ప్రశ్న పత్రాల రూపకల్పన
- మార్పులు చేయాలంటున్నవిద్యార్థులు, లెక్చరర్లు
Polytechnic | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో నెలకో పరీక్ష నిర్వహించడంతో విద్యార్థులు వామ్మో పాలిటెక్నిక్కా..! అంటున్నారు. సహజంగా పాలిటెక్నిక్ కోర్సుల్లో పదో తరగతి పూర్తిచేసిన వారే చేరతారు. ఇలా పాలిటెక్నిక్ కోర్సులో చేరగానే.. అలా పరీక్ష పెట్టడం, ఫలితాలు ప్రకటించడంతో విద్యార్థులకు పరీక్షల టెన్షన్ నెలకొంటున్నది. పాలిటెక్నిక్ కోర్సుల్లో నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని (సీసీఈ) అమలుచేస్తున్నారు. 6 సెమిస్టర్లు ఉండగా, 90 రోజులకు ఒక సెమిస్టర్ చొప్పున డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నారు.అయితే ఒక సెమిస్టర్లో రెండు మిడ్ సెమ్ పరీక్షలు, ఒక ఎండ్ సెమిస్టర్ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఇలా 90 రోజుల్లో మూడు పరీక్షలంటే నెలకో పరీక్ష చొప్పున నిర్వహిస్తున్నారు. ఇలా 30 రోజుల వ్యవధిలో ఒక పరీక్ష పూర్తికాగానే మళ్లీ పరీక్షను ఎదుర్కొవాల్సి వస్తున్నది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.
మిడ్ సెమ్ రద్దుచేయాలన్న డిమాండ్లు
నెల రోజులకో పరీక్ష ఇటు విద్యార్థులతోపాటు, అటు లెక్చరర్లకు సైతం తలకు మించిన భారమవుతున్నది. ప్రతి నెలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందించడం, పరీక్షలు నిర్వహించడం, మూల్యాంకనం చేసి ఫలితాలు విడుదల చేయడం సమస్యగా మారుతున్నది. పాలిటెక్నిక్ పరీక్షలే కాకుండా టైపురైటింగ్, షార్ట్‌హ్యాండ్, సర్టిఫికెట్ కోర్సులకు పేపర్లను సైతం పాలిటెక్నిక్ లెక్చరర్లే తయారుచేయాల్సి వస్తుంది. మొత్తంగా ఒక మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దుచేయాలని విద్యార్థులు, లెక్చరర్లు కోరుతున్నారు. నెలన్నరకో పరీక్ష చొప్పున, రెండు చాప్టర్లకు బదులు మూడు చాప్టర్లకు పరీక్షలు నిర్వహించడం ఉత్తమమన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

