Minister KTR | మీ మద్దతు ఇలాగే ఉండాలి.. కేటీఆర్‌కు మొహాలీ ఐఎస్బీ ఆహ్వానం..
Minister KTR | మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.
Minister KTR | హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): మొహాలీలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించి, ప్రసంగించడానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. వచ్చే నెల 11న మొహాలీలోని ఐఎస్బీ క్యాంపస్‌లో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ పబ్లిక్ పాలసీ (ఏఎంపీపీపీ) 8వ బ్యాచ్‌ను ప్రారంభించి, ప్రసంగించాలని కోరుతూ ఐఎస్బీ డీన్ మదన్ పిల్లుట్ల ఆహ్వానించారు.
‘ఐఎస్బీకి బలమైన మద్దతుదారుగా ఉన్న మీ సహకారం, మార్గదర్శకత్వం అమూల్యమైనవి. మీ మద్దతు మున్ముందు కూడా ఇలాగే కొనసాగాలి’ అని తన ఆహ్వాన పత్రంలో ఆయన పేర్కొన్నారు. ‘ఈ ప్రోగ్రాంను అభ్యసించేవారు పబ్లిక్ పాలసీలోని వివిధ అంశాలు, దాని రూపకల్పన ప్రక్రియను అర్థం చేసుకునేందుకు మీ అనుభవం, సలహాలు ఎంతో దోహదపడుతాయి. మీతో సంభాషించడం, మీ దృక్కోణాలను వినడం ద్వారా వారు ఎంతో ప్రయోజనం పొందుతారు’ అని మదన్ అన్నారు. ఏఎంపీపీపీ అనేది పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని మిడ్-కెరీర్ నిపుణులకు అందించే ప్రోగ్రాం. టఫ్ట్స్ యూనివర్శిటీ సహకారంతో ఐఎస్బీకి చెందిన భారతీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఈ ప్రోగ్రాంను రూపొందించింది. భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, ట్రైనింగ్ ద్వారా దీనికి ఆమోదం లభించింది. కాగా, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్, రైల్వే తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతోపాటు రాజకీయ నాయకులు, ప్రైవేటు రంగంలోని సీనియర్ ప్రొఫెషనల్స్ 50 మంది ఇందులో పాల్గొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

