మోదీ దీనికి బదులేది?
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష.
– న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
2.7.2022
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ.. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. తెలంగాణపై ఇంత ప్రేమ ఒలకబోస్తున మోదీ షా ద్వయం గత ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏం చేశారో జాతీయ కార్యవర్గం సాక్షిగా జవాబివ్వాలి. జాతినుద్దేశించి మాట్లాడనున్న ప్రధాని మోదీ.. తెలంగాణకు ఏమిచ్చారు? తెలంగాణకు ఏం చేశారో సమాధానమివ్వాలని తెలంగాణ సమాజం అడుగుతున్నది. కనీసం 2014లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో ఒక్కదాన్నైనా నెరవేర్చారా అన్న ప్రశ్నకు జవాబివ్వాలని కోరుతున్నది.
పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్న హామీని ఎందుకు నెరవేర్చలేదు? పైగా తమ పాలితరాష్ర్టాల్లో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టుకూ ఇవ్వకపోవడం వివక్ష కాదా?
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ దశాబ్దాల కల. విభజన చట్టంలో ఇందుకోసం ఇచ్చిన హామీని ఎందుకు తుంగలో తొక్కారు? మహారాష్ట్రకు ఎందుకు తరలించారు?
- ఐఐటీ, ఐఐఎం, నవోదయ వంటి ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటుపై ఇచ్చిన హామీ ఏమైంది?
- బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకూ ఎందుకు తిలోదకాలిచ్చారు?
- పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 9,10 షెడ్యూళ్ల ఆస్తుల విభజన ఎందుకు చేయడం లేదు?
- సీలేరు హైడల్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్కు ఎందుకు ధారాదత్తం చేశారు?
- తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుచేస్తామన్న హామీ ఏమైంది?
- అసెంబ్లీ స్థానాల పెంపుపై విభజన చట్టంలో ఇచ్చిన హామీని ఎందుకు తుంగలో తొక్కారు?ప్రపంచ టీకా రాజధానిగా మారిన హైదరాబాద్లో ఫార్మా సిటీ నిర్మాణానికి ఎందుకు ఆర్థిక సహకారం అందించడంలేదు?
- జల వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు?
- వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సహాయాన్ని ఎందుకు ఆపేయాల్సి వచ్చింది?
- దేశవ్యాప్తంగా మెగా పవర్లూమ్ టెక్స్టైల్ క్లస్టర్లను ఏర్పాటుచేసిన మోదీ.. తెలంగాణ పలుమార్లు అడిగినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు?
- తెలంగాణ సమాజం నిగ్గదీసి అడుగుతున్నది.. మోదీ కార్యవర్గం ఏం జవాబు చెప్తుంది?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

