CPI Narayana | అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్న మంత్రులు: సీపీఐ నారాయణ
హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు
హైదరాబాద్ , మే 20: హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) విమర్శించారు. రాష్ట్ర మంత్రులంతా అందాల భామల వెనుక సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యదర్శి సాంబశివరావుతో కలసి విలేకరులతో మాట్లాడుతూ.. భామల కోసం కోట్లల్లో ఖర్చుపెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని.. కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని విమర్శించారు. దేశానికి ట్రంప్ డీ ఫ్యాక్టో ప్రధానిగా, మోదీ డీ ఆక్టివ్ ప్రధానిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మోదీ డీయాక్టివ్ ప్రధానిగా ఉండటం దురదృష్టకరమని చెప్పారు. దేశానికి ప్రధానికి మోదీయా లేక ట్రంప్ అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు.
తల్లి దండ్రులు కష్టపడి మంచి భవిష్యత్ కోసం పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారని, వారు అక్కడి నుంచి పంపించే డబ్బుపైనా 5 శాతం టాక్స్ పేరుతో దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత్‌పై అమెరికా పైశాచికానందం పొందుతుందని విమర్శించారు. అమెరికా విధానాన్ని మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదన్నారు. ట్రంప్ యుద్ధం అపమంటే ఆపుతారు, కానీ అమెరికా ఆడుతున్న దోపిడి పైశాచికత్వాన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. టెర్రరిస్టులను అడ్డంపెట్టుకొని మోదీ సొంత రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టెర్రరిస్టులకు వ్యతిరేకంగా దేశం మొత్తం మద్దతు తెలిపితే.. మోదీ మాత్రం ట్రంప్‌కు జై కొట్టి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

