Model School | రేపే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష.. విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి
Model School | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు మాస్క్ తప్పనిసరి చేశారు అధికారులు.
Model School | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 6 నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. 6వ తరగతిలో 19,400 సీట్లు ఖాళీగా ఉండగా, 40,137 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 7 నుంచి 10 తరగతులకు కూడా భారీగానే దరఖాస్తులు వచ్చాయి. అయితే కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 194 స్కూళ్లను ప్రభుత్వం నిర్వహిస్తోంది.
6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7 నుంచి 10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మే 24న మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. మెరిట్ జాబితాలో ఉన్న విద్యార్థులకు మే 25 నుంచి 31 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. హాల్‌టికెట్లు సహా ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 040 -23120335, 23120336 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

