హైదరాబాద్ : తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా శుక్రవారం ఆకుల లలిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సంస్థ కార్యాలయంలో పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని పదవులు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత ఆకాక్షించారు.
కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.