నూతన ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తాం : ఎమ్మెల్సీ కవిత
ఆవిష్కర్తలను ప్రోత్సాహిస్తాం | నూతన ఆవిష్కర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.

హైదరాబాద్ : నూతన ఆవిష్కర్తలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తక్కువ ఖర్చుతో సిమెంట్ పైపుల్లో ఇండ్లను నిర్మిస్తున్న యువతి పేరాల మానస రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
హైదరాబాద్‌లో సోమవారం ఎమ్మెల్సీ కవితను కలిసిన మానస నూతన విధానంలో ఇండ్లను నిర్మిస్తున్న తీరును ఆమెకు వివరించారు.
మానస రెడ్డి భవిష్యత్తులో మరిన్ని నూతన ఆవిష్కరణలతో రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ఆకాంక్షించారు.
సిమెంటు పైపుల్లో మైక్రో ఇళ్లు..
కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామానికి చెందిన పేరాల మానస రెడ్డి తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో ప్రాథమిక విద్యాభాసం పూర్తి చేసింది.
సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చదివింది. వివిధ దేశాల్లో అక్కడి వాతావరణానికి అనుగుణంగా తక్కువ ఖర్చుతో ఇండ్లను నిర్మిస్తున్న విధానాలను అధ్యయనం చేసింది.
ఆ అనుభవంతో మన ప్రాంతంలోనూ తక్కువ ఖర్చుతో ఇంటి డైజన్లను రూపొందించింది. రెండు వేల మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన కాంక్రీట్ పైపు (తూము)లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓపాడ్స్ లేదా మైక్రో ఇళ్లుగా పిలిచే ఇల్లును నిర్మించి ఔరా అనిపిస్తోంది.
ఇండియాలోనే తొలిసారి నిర్మించే ఈ ఓపాడ్ ఇల్లు 40 నుంచి 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో 15 రోజుల్లో నిర్మించేందుకు వీలుంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

