MLC Kavitha | కొనసాగుతున్న కవిత విడుదల ప్రక్రియ.. రాత్రి 8 గంటల తర్వాత జైలు నుంచి బయటికి
MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవిత విడుదల కోసం రిలీజ్ వారెంట్ జారీచేసింది. విడుదల ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నది.
MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఎమ్మెల్సీ కవితను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవిత విడుదల కోసం రిలీజ్ వారెంట్ జారీచేసింది. విడుదల ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో గంట సమయం పట్టే అవకాశం ఉన్నది. అంటే ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత కవిత జైలు నుంచి బయటికి రానున్నారు. దాదాపు 165 రోజుల తర్వాత ఆమె జైలు నుంచి బయటకు వస్తున్నారు.
లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ సుప్రీంకోర్టు ఇవాళ కవితకు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆమె బెయిల్ కోసం రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఇవాళ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు ట్రయల్ కోర్టులో విచారణకు హాజరైన అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.
కవిత వెంట ఆమె భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారు. మరోవైపు రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. కాగా కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ కేసులో దర్యాప్తు పూర్తయ్యిందని.. ఛార్జ్ షీట్ కూడా దాఖలైందని ఈ దశలో కవితను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచడం సరికాదని అభిప్రాయడింది.
సెక్షన్ 45 ప్రకారం ఒక మహిళ బెయిల్ పొందేందుకు అర్హత ఉందని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. సెక్షన్ 45 అనేది దుర్బల మహిళలకు మాత్రమే వర్తిస్తుందన్నట్లు ఢిల్లీ హైకోర్టు జడ్జి వ్యవహరించారని వ్యాఖ్యానించింది. సెక్షన్ 45పై కోర్టులు సున్నితంగా వ్యవహరించాలని చెప్పింది. ఒక మహిళ విద్యాధికురాలు అయినంత మాత్రాన ఆమెకు బెయిల్ నిరాకరించడం సరికాదని పేర్కొంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

