బతుకమ్మ పాట బృందగానం చేసిన కవిత
బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
- ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో విడుదల
- ప్రజలు ఇష్టమైన పాటలను భారతజాగృతితో పంచుకోవడానికి ప్రత్యేక వాట్సాప్ నంబర్ కేటాయింపు
హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ సంబురాలకు భారత జాగృతి సన్నాహాలు మొదలుపెట్టింది. భారత జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాట వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ప్రముఖ గాయకులు తేలు విజయ, పద్మావతి, మౌనిక యాదవ్, సౌమ్యతోపాటు భారత జాగృతి సాంస్కృతిక విభాగం జాతీయ కన్వీనర్ కొడారి శ్రీనుతో కలిసి కవిత పాట పాడటం వీడియోలో కనిపించింది.
తెలంగాణ జాగృతి యాప్లో ఇప్పటికే దాదాపు 150 బతుకమ్మ పాటలు ఉన్నాయి. ప్రజల సహకారంతో అరుదైన, ప్రాచీన, కొత్తగా పూర్తి చేసిన బతుకమ్మ పాటలను భారత జాగృతి సేకరిస్తున్నది. +91 89856 99999 నంబర్కు వాట్సాప్ ద్వారా బతుకమ్మ పాటలను పంపించాలని కవిత విజ్ఞప్తి చేశారు. తమకు ఇష్టమైన బతుకమ్మ పాటలను సామాజిక మాధ్యమాల్లో భారత జాగృతికి ట్యాగ్ చేస్తూ పోస్టులు చేయాలని, తెలంగాణ జాగృతి యాప్ ద్వారా షేర్ చేయాలని పిలుపునిచ్చారు. బతుకమ్మ పాటల సేకరణ, రూపకల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించిన కొడారి శ్రీనును ఈ సందర్భంగా కవిత అభినందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
Vijay TVK | ఇండియా బ్లాక్ నిరసనల్లో చేరనున్న విజయ్ టీవీకే పార్టీ.. వెల్లడించిన వీసీకే నేత
ఇంత చేతకాని సీఎం ఎవరైనా ఉంటారా? : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

