BRS | బీఆర్ఎస్ను భయపెట్టేందుకే!.. కవిత అరెస్టు ఎన్నికల జిమ్మిక్కు!
కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ అరెస్టు చేయటమే అందుకు కారణం.
- ఎన్నికల షెడ్యూల్‌కు ముందురోజే
- బలపడేందుకు బీజేపీ ఎత్తులు?
- బీఆర్ఎస్ను బలహీనపర్చే చర్యలు!
- ‘ముందు ఈడీ, తర్వాత మోదీ’ మాట నిజమైంది
- లబ్ధి కోసమే అంటున్న పరిశీలకులు
BRS | హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ సర్కార్ పన్నిన ఎన్నికల జిమ్మిక్కు నగ్నంగా బయటపడిందా? అంటే అవునంటున్నారు రాజకీయ పరిశీలకులు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ఒకరోజు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ అరెస్టు చేయటమే అందుకు కారణం. ఒకవైపు ఈ కేసుపై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పటికీ, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కవితను అరెస్టు చేయటంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అరెస్టు చేస్తే సోమవారం వరకు బెయిల్ పిటిషన్‌కు అవకాశం లేకుండా ఈడీ వ్యవహరించిందని, ఇది ముందస్తు వ్యూహమేనని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఒక మహిళను ఇంటి వద్దే విచారణ జరపాలని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం భార్య నళినీ చిదంబరం కేసులో ఈడీకి న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇదే అంశంపై కవిత న్యాయపోరాటం చేస్తున్నారు. అయినా ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ఈడీ ఏకపక్షంగా వ్యవహరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
టక్కుటమార విద్యలు బీజేపీకి కొత్తకాదు
‘రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేయటం, లొంగదీసుకోవటం బీజేపీ సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఇలాంటి టక్కుటమార విద్యలను అనేక సందర్భాల్లో ప్రయోగించింది. ఇదే కేసులో ఆమ్ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు వరుసబెట్టి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఆ పార్టీ సీనియర్ నేత సిసోడియాను అరెస్టు చేసి జైలులో పెట్టింది. కవిత అరెస్టు కాకతాళీయమా? పథకం ప్రకారం జరిగిందా? అనేది పక్కన పెడితే, కేంద్రం తమ రాజకీయ ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు ‘ముందు ఈడీ వస్తది.. తర్వాత మోదీ వస్త డు’ అన్న మాట అక్షరాల నిజమైంది. ఈడీ బృందం శుక్రవారం కవిత ఇంటికి రాగా, సాయంత్రం హైదరాబాద్‌కు ప్రధాని మోదీ వచ్చారు’ అని పరిశీలకులు చెప్తున్నారు.
ఎన్నికల్లో లబ్ధి కోసమే!
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న ప్రచారాన్ని కాంగ్రెస్, ఇతర పార్టీలు విస్తృతం చేశాయి. దీని వల్లే తమకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు రాలేదని బీజేపీ నేత ల వాదన. ఈ అభియోగం నుంచి బయటపడకపోతే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే జరుగుతుందన్న భయంతో కవితను ఈడీ అరెస్టు చేసి ఉంటుందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

