MLA Vanama | ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ బీఆర్ఎస్దే అధికారం : ఎమ్మెల్యే వనమా
MLA Vanama | దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : దేశం మెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా స్పష్టం చేశారు. తెలంగాణ మరోసారీ బీఆర్ఎస్సే సత్తా చాటుతుందని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పార్టీ పాచికలు పారవని, అది ఎన్ని ఎత్తులు వేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎన్నికపై అనర్హత కేసులో ఇటీవల సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం విదితమే.
అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించిన అనంతరం గురువారం తొలిసారిగా కొత్తగూడెం చేరుకున్న ఎమ్మెల్యే వనమాకు.. అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు సుజాతనగర్ మండలం నాయకులగూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. డప్పుల చుప్పుళ్లు, బైక్ ర్యాలీలు, గులాబీ జెండాలతో కొత్తగూడేనికి తోడ్కొని వచ్చారు. అభిమానులు గజమాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. కొత్తగూడెం అభివృద్ధికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయన సహకారంతో కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు.
ప్రజలు తనకే ఓటు వేసి తనను గెలిపించారని, న్యాయం తన వైపే ఉందని అన్నారు. సుప్రీం కోర్టులో తనకు న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నానని అన్నారు. ముర్రేడు వాగుకు రిటైనింగ్ వాల్‌కు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ల పక్రియ మొదలవుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
ఏఐటీయూసీ జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా పల్లా దేవేందర్ రెడ్డి
Spirit | ప్రభాస్ ‘స్పిరిట్’పై సెన్సేషనల్ అప్డేట్.. షూటింగ్‌కు ముందే ఎడిటింగ్ పనుల్లో బిజీగా సందీప్ రెడ్డి వంగా!
‘రుద్రమదేవి వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు కృషి’
Ritabrata Banerjee | టీఎంసీ రెబల్ వర్గానికి షాక్.. రిటాబ్రత బెనర్జీ ప్రతిపక్ష నేత హోదాను రద్దు చేసిన హైకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

