MLA T Harish Rao | తెలుగు సమాజం.. సంస్కృతికి `ఆటా` అపురూపమైన సేవలు.. హరీశ్ రావు ప్రశంస
MLA T Harish Rao | తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అందిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు.
MLA T Harish Rao | తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలను అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అందిస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు చెప్పారు. శనివారం రవీంద్ర భారతిలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) అందిస్తున్న అపురూపమైన సేవలను ఆయన కొనియాడారు. విదేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారని పేర్కొన్నారు.
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అని రాయప్రోలు సుబ్బారావు ఇచ్చిన పిలుపును మన తెలుగు ప్రజలు అంది పుచ్చుకున్నారని హరీశ్ రావు చెప్పారు. అమెరికాలోని పదిలక్షల మంది తెలుగువారు తమ సంప్రదాయాలను, కళలు మర్చిపోకుండా కొనసాగిచడంతోపాటు వేల మైళ్ల దూరంలో ఉన్న సాటి తెలుగు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు.

`33 ఏళ్లుగా `ఆటా` తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సేవ చేయడం ఒక ఎత్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడడం మరో ఎత్తు. మారుమూల అచ్చంపేట నల్లమల అడవుల్లోని చెంచు ప్రజలకు దుప్పట్లు, దుస్తులు అందించి పెద్ద మనసు చాటుకున్నఅందరికీ అభినందనలు. ఎక్కడి అమెరికా.. ఎక్కడి అచ్చంపేట.. ఈ బంధాన్ని కలిపింది మన తెలుగు భాష, సంస్కృతి` అని హరీశ్ రావు అన్నారు.
`50 ఏండ్ల నట ప్రస్థానంలో సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అందుకోని విజయంలేదు. ఆబాల గోపాలన్ని నవ్వించిన మన ‘మాయలోడి’కి ఈ పురస్కారం ‘ముత్యమంత ముద్దు’ వంటిది. హాస్యం మన జీవితంలో బరువును తగ్గిస్తుంది. ఆరోగ్యకర హాస్యం ఆలోచింపజేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ హాస్యం ప్రత్యేకమైనది. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ఎవరికివాళ్లే గొప్పవాళ్లు. కానీ వాళ్లు హీరోలు కాదు. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక పాత్రలో హీరో షేడ్‌ను, కమెడియన్ షేడ్‌ను అద్భుతంగా పండించడం ఆయనకే చెల్లింది` అని వ్యాఖ్యానించారు.
`రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో వినోదంతోపాటు సామాజిక సందేశం కూడా ఉంటుంది. డిష్యుం డిష్యుం ఫైటింగ్‌లతో కాకుండా తెలివితేటలతో విలన్లకు కనువిప్పు కలిగిస్తాడు. మన జీవితానికి ఓ నలుగురు మనుషులు ఎంత అవసరమో ‘ఆ నలుగురు’లో భావోద్వేగంతో చూపాడు. ‘అహనా పెళ్లంట’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి గిలిగింతలు పెట్టే సినిమాలతోపాటు ‘ఆ నలుగురు’, ‘ఓనమాలు’ వంటి సామాజిక సందేశమున్న సినిమాలు రాజేంద్ర ప్రసాద్ నటవైదుష్యానికి అద్దంపడతాయి. మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ అధ్యక్షుడిగా ఆయన తనతోటి ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించారు. ఆయనను ఆటా లైఫ్ అచీవ్’మెంట్ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఆయనకు, ఆటా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు` అని హరీశ్ రావు చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పులివెందుల పులినని చెప్పుకునే జగన్.. ఓటు వేయకుండానే పిరికిపందలా పారిపోయారు.. అచ్చెన్నాయుడు ఎద్దేవా
అన్నాచెల్లెలుగా పేర్కొంటూ అద్దె ఇంట్లో నివసించిన జంట.. ఉరి వేసుకున్న యువకుడు, ప్రియురాలు గదిలో నిర్బంధం
కట్టిపడేసే చూపులు.. కిర్రెక్కించే పోజులు.. బ్లూ శారీలో ప్రణవి మనుకొండ హాట్ ఫొటోలు!
AP Elections | ఏపీలో చెదురు, ముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం : ఎస్ఈవో
KTR | రైతు కుటుంబాలకు అండగా ఉంటాం.. మరో ఏడాది ధైర్యంగా ఉండండి.. బోథ్‌లో కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

