గంగాధర, అక్టోబర్ 8: ఇంటర్ ఫస్టియర్ టాపర్ అక్షర ఇంటికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెళ్లారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో విద్యార్థిని తల్లిదండ్రులు నడుపుతున్న టిఫిన్ సెంటర్లో ఆమెతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా అక్షర తల్లిదండ్రులను ఎమ్మెల్యే ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మూడు నెలల కింద బూరుగుపల్లిలోని తన నివాసంలో అక్షరను సుంకె సన్మానించారు. ఏదో ఒకరోజూ ఆమె ఇంటికొస్తానని మాటిచ్చారు.