జగిత్యాల జిల్లాకు బీసీ స్టడీ సర్కిల్ మంజూరు కావడంపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ హర్షం వ్యక్తంచేశారు. స్టడీ సర్కిల్ మంజూరుకు కృషిచేసిన బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్ 1,2,3,4, ఇతర ఉద్యోగాలకు పోటీ పడుతున్న అభ్యర్థుల కోసం ఉచిత కోచింగ్ ఇస్తూ స్టడీ మెటీరియల్ కూడా అందజేస్తారని చెప్పారు.
ప్రస్తుతం జిల్లాకు మంజూరైన బీసీ స్టడీ సర్కిల్ మోతె రోడ్డులోని తన సొంత భవనంలో నడుస్తుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. శిక్షణ తీసుకునే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనం ఉంటుందని వెల్లడించారు. రాయికల్,జగిత్యాల పట్టణాలకు చెందిన అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్లకు, జగిత్యాల అర్బన్, రూరల్, సారంగా పూర్, బీర్పూర్, రాయికల్ మండల అభ్యర్థులు ఎంపీడీవోలకు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యాలయంలో లేదా 9603681993 , 8341033333 మొబైల్ నంబర్లలో సంప్రదించవచ్చని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ వెల్లడించారు.