బడంగ్‌పేట, డిసెంబర్19 : మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి (MLA Sabita Indrareddy) మరోసారి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం తుక్కుగూడ వైపు ఆమె వెళ్తుండగా ఓ దివ్యాంగ వృద్దుడు(Disabled old man )ప్రధాన రహదారిపై పడి కొట్టుకుంటున్న విషయాన్ని ఆమె గమనించారు. వెంటనే కారు దిగి బాధితుడి వద్దకు వెళ్లారు. వృద్ధుడికి పిట్స్ వచ్చిన్నట్లు గమనించారు. తన సిబ్బంది సహాయంతో సాధారణ స్థితికి వచ్చే విధంగా చేశారు. అతడి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి కొంత నగదు ఇచ్చి ఆటోలో తన ఊరు ఆమనగల్‌కు పంపించారు. సకాలంలో స్పందించి మానవీయంగా ఆదుకున్న ఎమ్మెల్యేను పలువురు ప్రశంసించారు.