ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన పూర్తి
MLA Quota MLC Election Nomination scrutiny Process Completed | ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్ మహేశ్ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా..

హైదరాబాద్ : ఎమ్మెల్యే కోట్లా ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన కార్యక్రమం పూర్తయింది. ఎన్నికల పరిశీలకుడు, ఐఏఎస్ మహేశ్ ఆధ్వర్యంలో పరిశీలన చేపట్టగా.. టీఆర్ఎస్, శ్రమజీవి పార్టీల అభ్యర్థులు హాజరయ్యారు. శ్రమజీవి పార్టీ అభ్యర్థులు భాస్కర్, కోయల్కర్ దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించారు. ఆరుగురు టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తేల్చారు.
శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, పాడి కౌశిక్‌రెడ్డి, సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే.
ఇదిలా ఉండగా.. నామినేషన్ ఆమోదం పొందాలంటే పది మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదించాల్సి ఉంటుంది. శ్రమజీవి అభ్యర్థులిద్దరినీ ఏ ఒక్క ఎమ్మెల్యే పత్రిపాదించలేదని, ఈ క్రమంలో వారి నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం వరకు గడువు ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

