TS High Court | దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన దానం.. ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి చేరిన విషయం విధితమే. ప్రస్తుతం దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక పార్టీలో ఎమ్మెల్యే గెలిచి.. మరో పార్టీ తరఫున పోటీ చేస్తున్న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్లో కోరారు. పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే సభాపతి గడ్డం ప్రసాద్ వద్ద ఇప్పటికే అనర్హత పిటిషన్‌ను బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసింది.