Lasya Nanditha | ముగిసిన పోస్టుమార్టం.. సాయంత్రం అంత్యక్రియలు
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు.
Lasya Nanditha | కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం చెందారు. శుక్రవారం ఉదయం పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అక్కడికక్కడమే మృతిచెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. శవపరీక్ష పూర్తి చేసిన వైద్యులు.. ఆమె భౌతికఖాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మరికాసేపట్లో కార్ఖానాలోని నివాసానికి లాస్య నందిత పార్థివదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం మారేడుపల్లిలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఠా గోపాల్, కార్పొరేటర్ విజయా రెడ్డి ప్రస్తుతం గాంధీ దవాఖాన వద్ద ఉన్నారు. అంతిమయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు తగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా, నందిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నందిత తల్లి, సోదరిని ఓదార్చారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

