ఓట్లేయలేదని దాడులు చేస్తరా?
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని విర్రవీగుతూ సూర్యాపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్‌రెడ్డి రాక్షస పాలనను సాగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- మూడుసార్లు ఓడించినా దామోదర్ బుద్ధి మారలే
- భయభ్రాంతులకు గురిచేస్తే ప్రజలే తిరుగబడతారు
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి హెచ్చరిక
సూర్యాపేట, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని విర్రవీగుతూ సూర్యాపేటలో కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర్‌రెడ్డి రాక్షస పాలనను సాగిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళికాప్రకాశ్కు చెందిన జాజూ హోటల్ భవనాన్ని అర్ధరాత్రి దొంగల మాదిరిగా కూల్చివేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కూల్చేసిన భవనాన్ని శనివారం ఉదయం ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. సూర్యాపేట జనం వరుసగా మూడుసార్లు ఓడించినా దామోదర్‌రెడ్డి బుద్ధి మారలేదని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటను అనూహ్య రీతిలో అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ పాలనలో ఆరు నెలలుగా మళ్లీ అరాచకాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. తిరగబడే చరిత్ర ఉన్న సూర్యాపేట జనం సహనం కోల్పోక ముందే కాంగ్రెస్ నేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కేవలం ఓట్లు వేయలేదని రాజకీయ కక్షతో ఉద్యోగులు, వ్యాపారులు, ఇతర పార్టీల నాయకులు, చివరికి డాక్టర్ల పైనా దాడులకు దిగడం సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నదని అన్నారు. రాచరిక పాలనలో కూడా లేని అరాచకం సూర్యాపేటలో కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భవనాలను కూల్చడం దుర్మార్గమని ఖండించారు. ఆయ న వెంట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకులు గండూరి ప్రకాశ్, జడ్పీటీసీ జీడి భిక్షం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

