ఏరియా హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే చల్లా
ఎమ్మెల్యే చల్లా | పరకాల పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు.

వరంగల్ రూరల్ : పరకాల పట్టణంలోని ఏరియా హాస్పిటల్లో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేస్తున్న కొవిడ్ వార్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరకాలలో సీఎం కేసీఆర్ చొరవ, మంత్రి ఎర్రబెల్లి సహకారంతో 10 ఆక్సిజన్ బెడ్స్ తో కూడిన వార్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ప్రజలందరూ ఇండ్లలోనే ఉండండి సురక్షితంగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ లాక్ డౌన్ సడలింపు సమయంలో అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. మాస్కు తప్పకుండా ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు.
మన మనోధైర్యమే మనకు బలమని, ధైర్యంగా ప్రజలు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో చల్లా మధుసూదన్, సూపరింటెండెంట్ డా.ఆకుల సంజీవయ్య, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

