హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పిడిపై నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ‘మార్చేయడానికి, తీసేయడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదు. ఓ సంస్కృతి, నాగరికత, తెలుగుజాతి వెన్నుముక ఎన్టీఆర్. తండ్రి గద్దెనెక్కి ఎయిర్పోర్ట్ పేరు మార్చారు. కుమారుడు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నారు. మిమ్మల్ని మార్చడానికి ప్రజలున్నారు. పంచ భూతాలున్నాయ్. ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు. పీతలున్నారు. విశ్వాసం లేని వారిని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ శనివారం ఆయన ట్వీట్ చేశారు.