మారుదాం.. మార్చేద్దాం!
మనం చేస్తున్న చిన్న పొరపాట్లే పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నయి. తిరిగి మనకే అనర్థాలను తెచ్చిపెడుతున్నయి. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఫలితంగా యావత్తు పర్యావరణం దెబ్బతింటున్నది. దీనికి ఏకైక పరిష్కార మార్గం మనం మారడమే..
- పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిద్దాం
- జీవనశైలిని మార్చుకోవడమే పర్యావరణహితం
- జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం
- కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ‘మిషన్ లైఫ్’
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మనం చేస్తున్న చిన్న పొరపాట్లే పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నయి. తిరిగి మనకే అనర్థాలను తెచ్చిపెడుతున్నయి. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం ఫలితంగా యావత్తు పర్యావరణం దెబ్బతింటున్నది. దీనికి ఏకైక పరిష్కార మార్గం మనం మారడమే.. జీవనశైలిని మార్చుకోవడమే. ఒక్కరుగా మొదలుపెట్టి, కుటుంబం, గ్రామం, మొత్తంగా దేశమంతా అనుకుంటే శక్తివనరులను ఆదా చేయవచ్చు. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌పీసీబీ) నడుంబిగించింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘మిషన్ లైఫ్’ పేరుతో కార్యక్రమాలు చేపట్టింది. నీతి ఆయోగ్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ సూచనలతో పీసీబీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. పరిశ్రమలు, దవాఖానలు, ప్రజా సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చెరువులు, కుంటలను శుభ్రంచేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనాల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు క్యూఆర్ కోడ్‌తో తయారుచేసిన పోస్టర్లను సైతం పీసీబీ రూపొందించింది. క్యూఆర్ కోడ్‌పై స్కాన్‌చేస్తే పర్యావరణానికి వాటిల్లుతున్న నష్టాలను తెలియజేస్తూ, ఏం చేయాలోనన్న అంశాలు ఉంటాయి.
మనం ఆచరించాల్సిన సూత్రాలు
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు వినియోగంలో లేకుంటే ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్లకు అందజేయాలి.
బ్యాటరీల స్థానంలో లిథియం బ్యాటరీలను వినియోగించడం.
వ్యక్తిగత వాహనాల స్థానంలో ప్రజారవాణాను వినియోగించడం. సైకిళ్లను, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను వినియోగించడం.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం. గుడ్డ సంచులనే ఉపయోగించాలి.
పెన్‌డ్రైవ్‌లు, హార్డ్డ్రైవ్ల స్థానంలో క్లౌడ్స్టోరేజీలకు ప్రాధాన్యం ఇవ్వడం.
ప్లాస్టిక్‌కు బదులుగా పేపర్ ప్లేట్లు, గ్లాసులను వినియోగించడం.
ఎల్ఈడీ బల్బులు, ట్యూబ్లైట్లనే
వియోగించడం.
సహజ, ఆర్గానిక్ పంట ఉత్పత్తులనే వినియోగించడం.
విరివిగా మొక్కలు నాటడం. కాలుష్య తీవ్రతను తగ్గించడం.
చిన్నప్రయత్నమే పెద్ద మార్పునకు శ్రీకారం
మన దినచర్యలను మార్చుకోవడమనే చిన్న ప్రయత్నమే పెద్ద మార్పునకు శ్రీకారం చుడుతుంది. ఇందుకు వ్యక్తులుగా మనం ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఆచరించాలి. కుటుంబాన్ని, స్నేహితులను పర్యావరణహిత అటవాట్లు చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇది మన ఆరోగ్యాన్నీ కాపాడుకొనేందుకు దోహదపడుతుంది. అంతేగాకుండా వృథాను అరికడుతుంది.
– వెంకటనర్సు, పర్యావరణ ఇంజినీర్, టీఎస్‌పీసీబీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

