35 సమావేశాలు.. 7500 కోట్ల పెట్టుబడులు
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు
మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతం
రాష్ట్రంలో పెట్టుబడులకు దిగ్గజ సంస్థల సంసిద్ధత
మన ఊరు-మన బడిలో భాగస్వాములు
కావాలని ప్రవాస భారతీయులకు పిలుపు
పర్యటన విజయవంతంపై కేటీఆర్ హర్షం
సహకరించిన తెలంగాణ ఎన్నారైలకు కృతజ్ఞతలు
హైదరాబాద్, మార్చి 28 : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలో జరిపిన పర్యటన విజయవంతమైంది. వారంపాటు సాగిన ఈ పర్యటనలో ఆయన పలు ప్రఖ్యాత ఫార్మా, ఐటీ కంపెనీల అధినేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా వారిని ఒప్పించారు. ఫార్మా, ఐటీ రంగంలో హైదరాబాద్ ఎదిగిన విధానాన్ని వారికి వివరించారు. పెట్టుబడులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభు త్వం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ అమెరికా కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. క్వాల్కమ్, అడ్వెంట్ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ప్రముఖ కంపెనీలు తెలంగాణలో రూ.7500 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించాయి. ఎక్కడా క్షణం తీరిక లేకుండా మంత్రి కేటీఆర్ వివిధ కంపెనీలతో, ఎన్నారైలతో వరుస సమావేశాలు నిర్వహించారు. దాదాపు 35 బిజినెస్ మీటింగ్స్‌లో పాల్గొన్నారు.
ఓ వైపు ఎన్నారైలతో.. మరోవైపు కంపెనీలతో..
ఓవైపు ఎన్నారైలతో స్వరాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరుతూనే మరోవైపు కంపెనీలతో భేటీ అవుతూ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. ఎన్నారైలతో భేటీలో.. ప్రభుత్వ బడుల బాగు కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమవంతుగా సాయం చేసి, తాము చదువుకొన్న స్కూల్ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అనేకమంది ఎన్నారైలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్, వైర్లెస్ టెక్నాలజీ, ప్రాసెసర్ల తయారీలో దిగ్గజ కంపెనీ క్వాల్కమ్ సంస్థ మంత్రి కేటీఆర్ చర్చల ఫలితంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో స్థాపించేందుకు ముందుకొచ్చింది. రూ.3905 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది.
అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ పెట్టుబడి
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న అడ్వెంట్ ఇంటర్నేషనల్ కంపెనీ రాష్ట్రంలోని ఫార్మారంగంలో రూ.1750 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తంచేసింది. షిప్ ఇన్ సంస్థ రూ.వెయ్యి కోట్లు పెట్టునున్నట్టు తెలిపింది. ఫార్మా కొపియా, క్యూరియా గ్లోబల్ సంస్థలు, ప్రముఖ ఐటీ సంస్థ స్ప్రింక్లర్, ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ కాన్లుయెంట్ మెడికల్ వంటి సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
పర్యటన విజయవంతం: మంత్రి కేటీఆర్
వారంపాటు సాగిన అమెరికా పర్యటన విజయవంతం కావడంపై మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు తన సంతోషాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకొన్నారు. ఈ వారం రోజుల పర్యటనలో 35 బిజినెస్ సమావేశాలు నిర్వహించి రాష్ర్టానికి రూ.7500 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చినట్టు వెల్లడించారు. తన పర్యటన విజయవంతం కావడానికి కృషిచేసిన ఎన్నారైలకు, తన బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- commerce
- investments
- KTR
- poor
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

